జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా పునరుద్ధరిస్తాం: అమిత్‌షా

జమ్ముకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేసి, ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరిస్తామని ప్రకటించారు. రెండేళ్ల క్రితం జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా అమిత్‌షా పర్యటిస్తున్నారు. ‘ నియోజకవర్గాల పునర్విభజన ఎందకు ఆపాలి. ఏదీ ఆపే ప్రసక్తే లేదు. నియోజకవర్గాల పునర్విభజన అనంతంరం ఎన్నికల నిర్వహిస్తాం. ప్రత్యేకహోదాను పునరుద్ధరిస్తాం’ అని శ్రీనగర్‌లో జరిగిన యూత్‌ క్లబ్‌ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్‌ భద్రతా సవాళ్లు ఎదురౌతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి పర్యటన నెలకొంది. మూడు రోజులు పాటు ఆయన పర్యటించనున్నారు. కాశ్మీర్‌ లోయలో అభివఅద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శనివారం అమిత్‌ షా అన్నారు. కాశ్మీర్‌లో నూతన శకం మొదలైందన్నారు. ఉగ్రవాదం, అవినీతి పాలన, కుటుంబ రాజకీయాల నుంచి శాంతి, అభివఅద్ధి, ప్రజా శ్రేయస్సు వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు.
ఆర్టికల్‌ 370 రద్దైన సమయంలో కర్ఫ్యూ ఎందుకు విధించారని, ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ ఎందుకు చేశారన్న ప్రశ్నలు వచ్చాయని, దీనికి సమాధానం చెపుతానని అన్నారు. 70 సంవత్సరాలు, మూడు కుటుంబాలు జమ్ముకాశ్మీర్‌ను పాలించాయని, కాశ్మీర్‌లో 40,000 మంది ఎందుకు చంపబడ్డారు? సమాధానం ఉందా? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రద్దు చేసే సమయంలో.. కొందరు ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నించారు. ఇందులో కొన్ని విదేశీ శక్తులు కూడా భాగస్వామ్యమయ్యాయని, కర్ఫ్యూ విధించి ఉండకపోతే.. అనేక మంది తండ్రులు తమ కొడుకుల శవపేటికలను భుజాన వేసుకుని ఉండేవారని అన్నారు. కర్ఫ్యూ వల్ల యువత రక్షించబడ్డారని అన్నారు. ప్రత్యేక హోదా రద్దు.. కాశ్మీర్‌ను ఉగ్రవాదం నుండి అభివృద్ధి దిశగా పయనించిందని అన్నారు. గతంలో ఉగ్రవాదం, రాళ్ల దాడి గురించి విన్నానని, నేడు అభివృద్ధి, విద్య, నైపుణాభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోయువతతో స్నేహన్ని ఏర్పరుచుకోవడానికి తాను కాశ్మీర్‌ సందర్శించినట్లు చెప్పారు. కాశ్మీర్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోడీతో చేతులు కలపాలని యువతకు పిలుపునిచ్చారు.