రోడ్ల విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం

డుంబ్రిగుడ మండలం, గసభ పంచాయితీ, అడ్రగూడ గ్రామంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ రావు సందర్శించి వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. గ్రామస్థులతో ప్రధాన సమస్యను చెప్పమని అడిగితే సీసీ రోడ్ లేక చాలా అవస్థలు పడుతున్నామని నాయకులకు ఎంత విన్నపించుకున్న పట్టించుకోలేదని వాపోయారు. గ్రామస్థులు స్వయంగా మట్టి రోడ్డు నిర్మించుకున్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పవన్ కుమార్, సంతోష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. సమస్యని వెంటనే అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చ్చారు. అనంతరం గసభ పంచాయితీ నాయకులు, వీరమహిళలతో చర్చించి ఎక్కడ రోడ్డు సమస్య ఉన్న తన దృష్టికి తీసుకు రావాలని ప్రాధేయపడ్డారు. గిరిజనులు ఎంతో కష్టంతో కూడిన జీవన విధానం జీవిస్తున్నారని బాధపడ్డారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల నాయకులని కలిసి రోడ్ల విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సూచించారు.