బండారు శ్రావణిశ్రీ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం: నార్పల జనసేన

సింగనమల నియోజకవర్గం, జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ని అత్యధిక మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుంటామని నార్పల మండల జనసేన నాయకులు గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్ లు ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. నార్పల మండలం పరిధిలోని పప్పూరు గ్రామంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ఆధ్వర్యంలో జనసేన-తెలుగుదేశం ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అంటూ పోస్టర్లు వేయడం తప్ప కనీసం అభివృద్ధి పై ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో వైసిపి నాయకులు లేరని విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని జనసేన-టిడిపి ప్రజా పాలనను ప్రజలకు అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. మండల సీనియర్ నాయకులు తుపాకుల భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తలంతా మన సింగనమల మన శ్రావణి అనే ఒకే నినాదంతో పనిచేసే సింగనమలలో జనసేన టిడిపి జెండా ఎగరవేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వర్, సమన్వయకర్త సాకే మురళీకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, నార్పల మండల జనసేన ఉపాధ్యక్షులు పొన్న తోటరామయ్య, వినోదం నారాయణస్వామి, వినోదంలోకేష్, ఆదినారాయణ ఉట్టినరసింహులు, షేక్ రహంతుల్లా, వినోద్, రాకేష్, మరియు మండల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.