“గరుడాచలం నాయుడు” అనే మహానుభావుడు పేద ప్రజల కోసం ఇచ్చిన స్థలాలపై మీ పెత్తనం ఏంటి: గాదె

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో తూర్పు సత్రం 1858లో “గరుడాచలం నాయుడు” అనే మహానుభావుడు బీద ప్రజల కోసం టౌన్ లో 22 ఎకరాలు భూమిని, అదేవిధంగా ఈ ప్రాంతంలో 92 ఎకరాల వ్యవసాయ భూమిని దానంగా ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటే ఇక్కడ నివసించే ప్రజలు చనిపోయిన తర్వాత వారి యొక్క కర్మకాండలు చేసుకునే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడమైనది.

◆ తరువాత కాలంలో ఈ ట్రస్ట్ ప్రభుత్వం ఎండోమెంట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తరువాత రాజకీయ నాయకుల కన్ను పడి 22.38 ఎకరాలు ఉన్న భూమి ఈ రోజుకి కేవలం 5 ఎకరాలుగా ఉన్నది. మిగతా 15 ఎకరాలు ఎటు పోయాయో కూడా తెలియని పరిస్థితి. ఎవరు ఆక్రమించుకున్నారు అనేది తేలాల్సిన విషయం.

◆ ఇప్పుడు ఉన్న 5 ఎకరాలు రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ స్థలాన్ని తమ సొంత స్థలంగా ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇస్తూ వాటిపై వచ్చే ఆదాయం ఎటుపోతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు.

◆ ఈరోజు ఈ విషయంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ఈఓ శ్రీనివాసరావుని కలసి వీటిపై ఆరా తీయడం జరిగింది. వారు చెప్పేదేమిటంటే ఇక్కడ 5 ఎకరాల్లో 1.58 సెంట్లు ఎమ్మెల్యే బంధువులకు ఒక సంవత్సరానికి లీజుకు ఇవ్వడం జరిగిందని. మిగతా స్థలం అంతా మా చేతుల్లోనే ఉందని వారు తెలియజేశారు. కానీ లీజు తీసుకున్నవారు ఉన్న స్థలాన్ని మొత్తంలో క్రష్టర్లతో నింపేసి ఇష్టం వచ్చిన విధముగా చేస్తున్నారు. ప్రజల కర్మకాండలు చేసుకునే విధంగా ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేకుండా ఉంది. త్వరలో ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చూస్తానని ఈఓ శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అలా జరిగిన పక్షంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి అవసరమైతే రోడ్డు ఎక్కి ధర్నా చేస్తామని వారిని హెచ్చరించడం జరిగింది. ఈ విషయమై డిస్టిక్ ఎండోమెంట్ వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటానికి బయలుదేరుతున్నాము. జనసేనపార్టీ జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, గుంటుపల్లి తులసికుమరి, నామన శివన్నారాయణ, తాళ్లూరి అప్పారావు, సూర్య, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, గంగరాజు, కారిమూరి అంజనేష్, అరమళ్ళ సుజిత్, గోగణ ఆదిశేషు, జిడుగు మాధురి తదితర జనసైనికులు పాల్గొన్నారు.