సుప్రీంకోర్టు ఆదేశాలా- రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులా ఏది అనుసరించాలి??

  • జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

కోవూరు నియోజకవర్గం: ఇసుక అక్రమ తవ్వకాలని ఆపేయండి అంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మినగల్లు గ్రామం, కోవూరు నియోజకవర్గం ఇసుక రీచ్ వద్ద జనసేన ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ సుధీర్ బద్దిపూడి మరికొందరు జనసేన కార్యకర్తలతో లారీలను అడ్డగించి సెబ్, పోలీస్ అధికారులు కంప్లైంట్ చేసారు. వారి ఫిర్యాదును పట్టించుకోక పోగా సిబ్బందిని ఇబ్బంది పెడితే తిరిగి జనసైనికుల మీదే కేసులు పెడతామని చెప్పిన పరిస్థితిని వివరిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్రంలోనే 110 ఇసుక రీచుల్ని పెద్ద యంత్రాలతో తవ్వడానికి అనుమతులు లేవని నిషేధించిన ఆదేశాలు ఉండగా. ఈ అక్రమ తవ్వకాలను ఆపవలసిందిగా కోరేందుకు గురువారం సెబ్ అధికారులను మరియు ఎస్పీని సంప్రదించేందుకు వారు అందుబాటు లేకపోవటంతో ఇరిగేషన్ ఎస్.ఈని మరియు మైనింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ డిడి కలవడం జరిగింది. ఈ సందర్బంగా.. బుధవారం బుచ్చి ఎస్సై తెలిపినట్లు సుప్రీంకోర్టు మనకేమి రాసి ఇవ్వకపోయినా రేపు వచ్చే వరదల్లో గ్రామం కొట్టుకుపోకుండా చూడవలసిన బాధ్యత ఒక పౌరులుగా మనకు బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించదా..? అని అడగడం జరిగింది. అందరికీ సుప్రీంకోర్టు ఆదేశాలు తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సూచనలే పాటిస్తూ పోతున్నారు. 110 రీచులలో ఎక్కడా ఆపలేదు అని అధికారులు సెలవిస్తున్నా… ఎక్కడైనా ఒక్కచోట ప్రారంభం అవ్వాలి. కోట్ల రూపాయల రెవిన్యూ కొందరికే సొంతం అవుతుంది. భవనాల నిర్మాణం లో ఇసుక కు అవసరత ఉన్నా స్థానికులకు ఇసుక దొరక్కుండా ఆ సంపద మొత్తం ఒకరికే వెళ్తుంది. ఇసుక అమ్మ కాలు అంతా కూడా మ్యాన్యువల్ గా చేత్తో రాస్తున్న పక్షంలో సీరియల్ నెంబర్ లేకుండా బిల్లు పుస్తకాలు రికార్డులు, జిఎస్టి, ఐటి ఎంత ఏమిటి తెలియడం లేదు. పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ఇసుక రీచులన్నీ ఒకే కంపెనీకి చెంది ఉండడం ఏ ఒక్కచోట కూడా సీరియల్ నెంబర్ మైంటైన్ చేయడం చేయకపోవడంతో ఏ రీఛ్ లో ఎంత తవ్వు తున్నారు ఎంత రెవిన్యూ జనరేట్ అవుతుంది అని తెలుసుకోలేకున్నాము. ప్రామాణాలను అనుసరించి ఇసుక తవ్వు కోవడానికి అనుమతులపై ఆమోదం తెలిపిన ప్రతి అధికారి దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం.. వీలు కాకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చి జనసేన పార్టీ లీగల్ సెల్ తరఫున గ్రీన్ ట్రిభ్యునల్ ద్వారా పోరాడుతామని తెలియజేశారు.