గిరిజన యూనివర్సిటీ ఎక్కడ..?: తుమ్మి అప్పలరాజు దొర

  • గిరిజన అంటే నాయకులకు ఎందుకు చులకన..?

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం రెల్లి డివిజన్ లో గత ప్రభుత్వం హయాంలో గిరిజన యూనివర్సిటీ కొరకు గిరిజన 526 ఎకరాల భూసేకరణ చేసి భూమి ఇచ్చిన రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రతి కుటుంబానికి కూడా వారు ఇచ్చిన భూమికి భూమి ఇస్తామని హామీలిచ్చి అందలో భాగంగా 174 కుటుంబాలకు ఇంటి స్థలం ఇచ్చి అందరూ భాగంగా ఐటీడీఏ నిధుల ద్వారా 50 లక్షలు రూపాయలతో చదును చేసారు. ఆ సొమ్ము గిరిజనుల అభివృద్ధి కొరకు ఉపయోగించాల్సిన గిరిజన నిధులకు సంబందించినవి. అలాగే హుటాహుటిన ప్రహరీ కొరకు శంకుస్థాపన చేసి సుమారు ఐదు కోట్లతో ప్రహరి నిర్మించారు. ఇంతలో ప్రభుత్వం మారగానే అవేవీ చట్ట భద్రత కాదని కుంటి సాకులు చెబుతున్నారు గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలో ఉండాలని కొత్త ప్రభుత్వం మెంటాడ మండలంలో భూ సేకరణ చేసున్నారు మరి మెంటాడ మండలంలో గిరిజన యూనివర్సిటీ కి తీసుకున్న స్థలం షెడ్యూల్ ఏరియాకి సంబందించిందా.. అయితే మెంటాడ మండలంను షెడ్యూల్లో చేర్చండి మెంటాడ మండలంను అయినా మన్యం జిల్లాలో చేర్చి ఆ ప్రాంతం గిరిజన ప్రాంతంఅని అక్కడ 1/70చట్టం అమలవుతుందని చట్టం చేసి గిరిజనులపై మీకున్న చిత్తశుద్ధిని చూపెట్టుకోవాలని ఓ గిరిజన నాయకుడిగా కోరుకుంటన్నాను మళ్లీ మెంటాడ మండలంలో ఉన్న రైతులు కూడా భూ సేకరణ చేస్తూ మళ్లీ ఇంకోసారి గిరిజనలు మోసపోయేలాగా చేయకండి మంత్రులకి ఎమ్మెల్యేలకి ముందు చేసిన భూసేకరాణలో చెయ్యిలు తడవ లేదని రెండోసారి భూ సేకరణ చేస్తే తడుస్తాయని మీరు మీరు ఆశపడి మా గిరిజను తలరాతలు తాకట్టు పెడుతున్నారని మీభావిస్తున్నాం ఇప్పటికైనా కాసులకు కక్కుర్తి పడకుండా మీ స్వార్థ రాజకీయాల పక్కన పెట్టి భూసేరణ చేసిన ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ భవనాలు ప్రారంభిస్తారని కోరుకుంటున్నాం లేదా ఇప్పుడు కొత్తగా భూ భూసేకరణ చేస్తున్న ప్రాంతాన్ని మన్యం జిల్లాలో చేర్చి షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించి అప్పుడు యూనివర్సిటీ భూ సేకరణ చేస్తే మీ చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతుందని విజయనగరం జిల్లా జనసేన నాయకులు మరియు గిరిజన జేఏసీ విజయనగరం జిల్లా అధ్యక్షులు తుమ్మి అప్పలరాజు దొర అన్నారు.