జనసేన-టిడిపి అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలిపిస్తాం

  • కుల మతాలకు అతీతంగా కలిసి పనిచేస్తాం.
  • బలిజల ఓట్లతో గెలిచి బలిజలనే టార్గెట్ చేస్తున్నారు.
  • కాపు సంక్షేమ సేన, జనసేన పార్టీల ఆగ్రహం.

తిరుపతి, రాష్ట్రంలో ఓసీ లలో అధిక శాతం ఉన్న కాపు బలిజ గ్రూప్ కులాల ను టార్గెట్ చేసుకొని వైకాపా ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీని రూపుమాపాలని చూస్తున్నదని , కాపు సంక్షేమ సేన మరియు జనసేన పార్టీల చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమ కుమార్, తిరుపతి కార్యదర్శి హిమవంత్, పురుషోత్తం, జగన్, ఆది, లోహిత్, సెల్వ కుమార్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల డంక మోగించడంతో ఆ సెగ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తగిలిందని. జనసేన-టిడిపి పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తుండడంతో ఇక వైకాపాకు భయం పుట్టిందని, దీంతో కాపు బలిజలు అధికంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారని తెలుసుకొని. కాపు కులస్తులను టార్గెట్ గా చేసుకుని, హీనంగా దిగజారి వైసిపి కుల రాజకీయాలు చేస్తున్నదని ఆవేద వ్యక్తం చేశారు. నేడు తిరుపతిలో కిరణ్ రాయల్ ప్రధానంగా జనసేనకు వెన్నెముకగా ఉండడం ఓర్వలేని స్థానిక వైకాపా నేతలు ఆయన పై దిగదారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ జనసేనానికి కులమతాలు లేవని అందరిని కలుపుకు పోతారని కొనియాడారు. రానున్నది జనసేన-టిడిపిల ప్రభుత్వము అని పిలుపునిచ్చారు.