టేకు చెట్లు మాయం.. భాధ్యులుపై చర్యలు తీసుకోండి.. అనురాధ

రాయవరం: రాయవరం మండలం చెల్లూరు గ్రామ శివారులో 9 టేకు చెట్లు మాయం అని మంగళవారం ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారని జనసేన పార్టీ ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ ఆరోపించారు. చెల్లూరు గ్రామ శివారులో సర్వే నెంబర్ 176 లో ఉన్న సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే 9 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా నరికివేశారన్నారు. దీనిపై చర్యలు కోరుతూ.. పిర్యాదు అధికారులకు చేశామని పేర్కొన్నారు.