ఎన్నికల వేళ కులగణన ఎందుకు?

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ మరియు ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణల ఆధ్వర్యంలో కాకినాడ మునిసిపల్ కమీషనర్ కు తమ అధినాయకులు పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు వివరణలు కోరుతూ రిప్రజెంటేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 60 రోజులలో ఎన్నికలని పెట్టుకుని ఈ సమయంలో కులగణనను చేపించడంపై తమకు మరియు ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయనీ ప్రజల తరపున తమ నాయకుడు శ్రీ.పవన్ కళ్యాణ్ గారు వేసిన ప్రశ్నలని నివృత్తి చేయవలసినదిగా నగరంలో కులగణని నిర్వహిస్తున్న కాకినాడ సిటి మునిసిపల్ కార్పోరేషన్ కమీషనరుకు రిప్రజెంటేషన్ సమర్పించి డిమాండ్ చేసారు. ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ మాట్లాడుతూ ఇలా సేకరిస్తున్న వివరాలలో కులగణన అయితే అదొక్కటే చేయకుండా, వారి గోత్రం, వివాహితులా, పిల్లలు పుట్టారా లేదా లాంటి వ్యక్తిగత వివరాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యక్తిగత వివరాలను ఎన్నికలలో దుర్వినియోగ పరచడానికా సేకరిస్తున్నారు అని ప్రశ్నించారు. వినతిపత్రం సమర్పించాకా ఆ ప్రాంతంలోని ప్రజలకు ఈ కులగణనపై వివరిస్తూ కరపత్రాలను పంచి చైతన్యపరిచారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిలలు తదితరులు పాల్గొన్నారు.