పార్టీ అప్పగించిన బాద్యతకు న్యాయం చేస్తాను: వెంకటేష్

గోరంట్ల మండలం: ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ ను ఎన్ను కోవడం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ కు, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవని రవికుమార్ కు, జిల్లా కార్యదర్శి సురేష్ కు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు.. పార్టీ నాకు అప్పగించిన ఈ పదవికి శక్తి వంచన లేకుండా శాయశక్తులా న్యాయం చేస్తాను అని తెలియజేసారు.