తాండూర్ అభివృద్ధికి కృషి చేస్తా: నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన ఉమ్మడి బిజెపి-జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం పెద్దముల్ మండలంలోని గొట్లపల్లి, ఇందుర్, ఆత్కూర్, పాషాపూర్, తాట్టేపల్లి, అడికిచెర్ల గ్రామాలలో గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో శంకర్ గౌడ్ బిజెపి జనసేన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న యువతీ యువకులు అందరికీ ఉపాధి కల్పిస్తామని, తాండూర్ అభివృద్ధికి కృషి చేస్తానని తమ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుకే మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలను కోరుతూ చైతన్య పరుస్తూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కోరడం జరిగింది. ఈ ప్రచారానికి ప్రజలు కూడా తమ మద్దతు తెలుపుతూ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, బిజెపి పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, బిజెపి జనసేన కార్యకర్తలు మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అర్చన, కౌన్సిలర్ భద్రేశ్వర్, దోమ శీను, రమన్న, రవీందర్, మల్లేష్ యాదవ్, తాండ్ర నరేష్, అమ్రేష్, రాజ్ కుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.