మార్కాపురం జిల్లా చేయాలని జెఏసి ఆధ్వర్యంలో జనసేనపార్టీ నిరాహార దీక్ష

ప్రకాశం, పశ్చిమ ప్రకాశం, ప్రాంతంలోని మార్కాపురం జిల్లా చేయాలని కోరుతూ మార్కాపురం టౌన్ స్ధానిక ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా ఝాఛ్ ఆధ్వర్యంలో మొదటి రోజు నిరాహార దీక్ష శిబిరంలో జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ గారు మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్ గారు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ప్రాంతం కరువు కాటకాలంలో అత్యంత దుర్బిక్ష ప్రాంతమైన నల్లమల్ల పశ్చిమ ప్రాంతములోని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి సురేష్, మార్కాపురం టౌన్ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పొదిలి మండల అధ్యక్షులు పేరు శ్రీను, కొనకనమిట్ల మండల అధ్యక్షులు ప్రభావతి, తర్లుపాడు మండల జాయింట్ సెక్రటరీ రసూల్, సి.పి.ఐ నాయకులు అందే నాసరయ్య, జిల్లా సాధన సమితి నాయకులు సైదా, సి.పి.యం నాయకులు సోమయ్య, రఫీ జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీను, పిన్నెబోయిన లక్ష్మి రాజ్యం, పూజ లక్ష్మీ, భారతి, సూరే సువర్ణ, పిన్నెబోయిన శ్రీను, శిరిగిరి శ్రీను, శిరిగిరి చలపతి, రఫీ, బాదులా, జానకి రామ్, రమాకాంత్, వీరిశెట్టి శ్రీను,కురుకుందు శేఖర్, ఊటుకూరి వెంకటేశ్వర్లు, పోశం వెంకటేశ్వర్లు, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.