మ‌హేశ్ ద్విపాత్రాభిన‌యంతో ‘స‌ర్కారు వారి పాట‌’

సూపర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా తెర‌కెక్క‌నున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’.  ఈ సినిమాకు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంవహిస్తున్నారు. మే 31న లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత షూటింగ్ స్టార్ట్  చేద్దామ‌ని మ‌హేశ్ భావిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో మ‌హేశ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని. అందులో ఓ పాత్ర కాస్త నెగటివ్ ట‌చ్‌తో సాగుతుంద‌ని. మ‌రి ఈ వార్త‌ల‌పై ఈ సినిమా బృందం ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ సినిమా లో హీరోయిన్‌గా కీర్తిసురేశ్ న‌టిస్తున్నారు.