జనసేన లో మహిళా వెలుగు

జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మహిళా నాయకులు కోలా విజయలక్ష్మి, పసుపులేటి సుకన్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా కార్యకర్తలు పాత్ర ముఖ్యమైనది. కుటుంబ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించగలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. రానున్న జనసేన కమిటీలలో కీలక బాధ్యతలు కేటాయించనున్నామనీ.. ప్రతి గడప కి పార్టీ సిద్ధాంతాలను, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకీ చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ తో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణ పెన్నా మహిళా ప్రాంతీయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య తో పాటు పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.