నీటి ఎద్ధడిని తట్టుకోలేక కాళీ బిందెలతో మహిళల నిరసన

ఒంగోలు నగరంలోని.. కర్నూలురోడ్డు 43 డివిజన్ ఆంధ్రకేసరీనగర్ లోని మహిళలు నీటి ఎద్ధడిని తట్టుకోలేక కాళీ బిందెలతో కర్నూల్ రోడ్డు పై బైటాయించి నిరసన వ్యక్తం చెయ్యడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఒంగోలు తాలూకా సి ఐ మరియు మున్సిపల్ డి ఇ అక్కడకు చేరుకొని సదరు మహిళలకు మున్సిపల్ కార్పొరేషన్ వారితో మాట్లాడి ఒక వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని జనసేన పార్టీ కార్పొరేటర్ మరియు ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్ ఎదుట లిఖిత పూర్వకంగా రాసి అందించడంతో రమేష్ మరియు సి ఐ పై నమ్మకంతో సదరు మహిళలు నిరసన విరమించు కోవడం జరిగింది. మలగా రమేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 90 కోట్ల రూపాయలతో గుళ్ళకమ్మనుంచి బారీ పైప్ లైన్ నిర్మాణ పైపులైను నిమిత్తం మూడు కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం ఆగి పొవటం జరిగింది. కనీసం మూడు సంవత్సరాలుగా పైపులైన్ నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. వారం రోజుల్లో ప్రభుత్వం సమస్య పరిష్కారం చెయ్యకపోతే మహిళలకు అండగా జనసేన పార్టీ తరుపున పోరాటం ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ హెచ్చరించారు.