పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవవేడుకలు

పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ ఆఫీసు నందు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన జనసేన వీర మహిళలు వీర్ల లక్ష్మి, సింగంశెట్టి రమణ, షేక్ ఫాతిమా, నూతి సంధ్యారాణి లచే జనసైనికులు కేక్ కట్ చేయించి అనంతరం దుశ్శాలువతో సత్కరించారు.

మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. స్త్రీని శక్తి స్వరూపిణిగా భావించి కొలిచే దేశం మనదే అని.. సకల నదులు విధులు గిరులు ప్రకృతిని స్త్రీ రూపంగా భావించి గౌరవించే సనాతన సంప్రదాయం మనది అని కొనియాడారు. స్త్రీ మూర్తుల విజయాలను హర్షధ్వానాలు పలుకుతూ జరుపుకునే వేడుకే మహిళా దినోత్సవం తెలియజేశారు.

జనసేన నాయకులు పెడ కొలిమి కిరణ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో మహిళ ఒక అక్కగా భార్యగా తల్లిగా అనేక విధాలుగా సేవలు అందిస్తున్నారని.. భారతదేశంలో స్త్రీ పాత్ర చాలా ప్రముఖమైనది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు భయ్యవరపు రమేష్, పెడకొలిమి కిరణ్ కుమార్, చీదెళ్ళ రాము, అడపా వెంకట్, మట్టం పరమేష్, బోనబోయిన సతీష్, బవిరిశెట్టి శ్రీకాంత్, అంబటి సాయి, మల్లెల రామాంజి, కార్తీక్, శ్రీకాంత్, ధనుష్, ఆదిత్య మొదలగు వారు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-08-at-7.13.03-PM-1024x768.jpeg