ఉమెన్స్ డే స్పెషల్‌ గిఫ్ట్.. `వకీల్‌సాబ్‌` కొత్త పోస్టర్‌…

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌` నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ట్రీట్‌ వచ్చింది. మహిళలకు కొత్త పోస్టర్ తో విషెస్ చెప్పారు పవన్‌ అండ్ వకీల్‌సాబ్‌ టీం. ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్న ముగ్గురు అమ్మాయిలను పరిచయం చేసారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల లుక్‌ కూడా చూడొచ్చు. వీరి ముందు చైర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బుక్‌ పట్టుకుని కూర్చొని ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది…. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.