Razole: మహిళ సాధికారత జనాసేనానితోనే సాధ్యం

రాజోలు నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావం నుండి పార్టీ సిద్ధాంతాలు మరియు జనసేనాని సిద్దాంతాలు నచ్చి జనబాట కార్యక్రమంలో చూరుకుగా పాల్గొని తన మాటలతో మహిళలను, విద్యార్థినులను ప్రభావితం చేసిన వీర మహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ ఇటీవలే జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను వీరమహిళల విజయంగా అభివర్ణించారు. హోరున వర్షాన్ని సైతం లెక్క చేయక వీర మహిళలు సమిష్టిగా చేసిన ఎన్నికల ప్రచారాన్ని ఆమె కొనియాడారు నియోజకవర్గంలో మహిళలు, యువతులు, వృద్దులు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.