మహిళా రిజర్వేషన్ బిల్లు హర్షనీయం: సోమరౌతు అనురాధ

వేమూరు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం హర్షనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమ రౌతు అనురాధ పేర్కొన్నారు. బుధవారం వేమూరు విలేకరులతో మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని, అనేక సందర్భాల్లో వివిధ పార్టీలు మహిళా రిజర్వేషన్లు బిల్లుపై మాటల వరకే చెప్పారు గానీ నేటి వరకు రూపుదాల్చలేదు అన్నారు. ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టడం అభినందనీయమన్నారు. దీని ద్వారా మహిళలు చట్టసభల్లోనూ ఇతర రంగాల్లోనూ కూడా ఒక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేవ గౌడ ప్రధానిగా ఉన్న కాలంలోనే పార్లమెంటులో చర్చకు వచ్చిందని కానీ ఆనాడు కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం ద్వారా ఆగిపోయింది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర క్యాబినెట్ నేడు బిల్లు ఆమోదింపబడటం మహిళలు గర్వించదగిన విషయమని అనురాధ పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలు రాజకీయంగా మరింత ఎదిగి రాజ్యాధికారంలో పాలుపంచుకునే అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందుకోసం ప్రత్యేకతలు చూపుతారని అనురాధ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో కూడా పూర్తిగా ఆమోదం పొందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు వాసు, బ్రహ్మం, ఎలీషా, భాస్కర్, ఆలపాటి రాకేష్ తదితరులు ఉన్నారు.

కాకర్లముడి గ్రామములో వినాయకుని దర్శించుకున్న జనసేన నాయకులు

వేమూరు నియోజకవర్గం, వేమూరు మండలం, కాకర్లముడి గ్రామములో జనసైనికులు ప్రజలు పిలుపు మేరకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఉపాద్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, టీడీపీ నాయుకులు అమ్మిశెట్టి కిషోర్, బొల్లిమంత అంకమరావు, జిల్లా కార్యదర్శి బొడియ్య, మండల అధ్యక్షులు వూస రాజేష్, నియోజకవర్గ నాయకులు విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమములో పాల్గొనడం జరిగింది.