కుంభకర్ణ రవిబాబుని ఆదివాసీ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి

  • జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి

అనంతగిరి: అమాయక ఆదివాసీ ప్రజల భూమిని అక్రమంగా కాజేసిన కుంభకర్ణ రవిబాబుని ఆదివాసీ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి అని జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి అన్నారు. శుక్రవారం జనగిన జనసేన సమావేశంలో చిట్టం మురళి మాట్లాడుతూ ఆదివాసీ జేఏసీ రామన్న దొరగత కొన్ని సంవత్సరాల తరబడి అన్యాయంగా గుమ్మకోట పంచాయితి భుర్జవలస, శంకుపర్తి, మెట్ట పాడు గ్రామాలలో ఆదివాసీ ప్రజలు తీవ్రమైన దోపిడీకి గురౌతున్నారు. భూములను ఆక్రమించుకున్న కుంభకర్ణ రవిబాబు విలాసవంతమైన భవనాల్లో విశాఖపట్నంలో తన అక్రమ సంపాదనతో విలాసాలు, విందులు, వినోదాలు చేస్తున్నారు. కేవలం డబ్బు, పరపతి ఉందని నమ్మి ఓటువేసి గెలిపించి ప్రజాప్రతినిధి చేసిన పాపానికి అరకు నియోజకవర్గం ప్రజలు నరకం చూస్తున్నారు. ఇదంతా అధికార ప్రభుత్వ అండదండలు లేకుంటే సాధ్యపడుతుందా.. అతని అవినీతికి అంతం లేదా లేకుంటే ప్రభుత్వమే తమ పార్టీ కదా ఎలక్షన్స్ లో పండింగ్ ఇస్తారని అతని అక్రమాలను చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందా..? వాస్తవాలు ప్రజలకు తెలియజెయ్యాల్సిన బాధ్యత అధికారులకుంది. విచారణ వేగవంతం చేసి అమాయక ఆదివాసీ ప్రజలకు సహాయం చేసే గుణం సాటి గిరిజన ప్రజాప్రతినిధులకు లేకపోవడం చూస్తే వారి నాయకత్వ సమర్థత మీద అనేక అనుమానాలు ప్రజలకు రావడం సహజం. ఒక వ్యక్తి ఇంత దారుణమైన భూ ఆక్రమణ దారుగా చెలరేగిపోవడం, కట్టడి చెయ్యాల్సిన అధికార యంత్రాంగం చేష్టలూడి నాటకం చూస్తున్నట్టు నటించడం చూస్తుంటే వ్యవస్థ మీద గిరిజన యువతకు నమ్మకం పోతున్నమాట వాస్తవం ఇప్పటికైనా ఇటు ప్రజలు, అటు యువత ఇటువంటి అవినీతి జలగల్ని, అవినీతి ముసుగులో ఉన్న ప్రజాప్రతినిధులను రాజకీయ ప్రతినిధులుగా ఎన్నుకునేటప్పుడు వాస్తవ పరిశోధన చెయ్యాలి. ఎప్పుడైతే నాయకుడిని ఎన్నుకోవడంలో పొరపాటు చేస్తామో అప్పుడు మన హక్కుల్ని, చట్టాలను చివరికి ప్రజాస్వామ్య విలువలను మనమే వ్యభిచారానికి పెడుతున్నామని తమకు తాముగా ఆలోచించే జ్ఞానం గిరిజన ప్రజలకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర, జేఏసీ గంగరాజు, లాయర్ రాంబాబు, జేఏసీమండల కో కన్వీనర్ రవీంద్ర, భాస్కరావు శంకుపర్తి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.