భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు యడ్లపల్లి చేయూత

  • తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 5 వేలు చొప్పున రెండు కుటుంబాలకు 10 వేలరూ. అందచేత
  • ఉరిమి గ్రామంలో జంగం వెంకట స్వామి,
  • దొండపాటి సాంబ శివ రావు గార్ల కుటుంబాలకు పరామర్శ
  • మరింత భరోసా కల్పిస్తామని యడ్లపల్లిరామ్ సుధీర్ హామీ

పెడన నియోజకవర్గం: పెడన మండలం, ఉరిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఉరిమి దళితవాడలోని జంగం వెంకట స్వామి ఇల్లు, ఉరిమిలోని దొండపాటి సాంబ శివరావు ఇల్లు కూలిపోయాయి. గురువారం ఉరిమి పర్యటనలో ఉన్న రామ్ సుధీర్ కు స్థానిక నాయకులు ఈ విషయం తెలియచేశారు. వెంటనే రామ్ సుధీర్ స్పందించి రెండు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5 వేలు చొప్పున రెండు కుటుంబాలను పరామర్శించి మొత్తం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోయిన ఉదయ భాస్కర్ రావు, దొండపాటి శ్రీనివాస రావు, దొండపాటి వెంకట్రామయ్య, పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందరరాజు, సింగం శెట్టి అశోక్, యర్రపోతు అయ్యప్ప, దారపు రెడ్డి నవీన్, బాలు మహేంద్ర, కొండ, సయ్యద్ షఫీ, వరుధు రాము, కొప్పినీటి శివమణి, గడ్డిగోపుల నాగ, వన్నెమ్రెడ్డి కిరణ్, నందం శివ స్వామి, బాకీ నాని, బాదం వినోద్, అంజిబాబు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.