ప్రజలమీద దండయాత్రకి వై.సి.పి సిద్ధము

కాకినాడ సిటి: జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో మంగళవారం పత్రికావిలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముత్తా శశిధర్ మాట్లాడుతూ గత 20 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలు నిర్వహిస్తూ సిద్ధం సిద్ధం అని అరచి గీ పెడుతున్నారనీ రాష్ట్రం మొత్తం పోస్టర్లతో నింపేస్తున్నారన్నారు. దానికి అనుగుణంగా కాకినాడ సిటిలో కూడా సిద్ధం పోస్టర్లతో నింపేస్తూ వారియొక్క ధనబలాన్ని చూపిస్తున్నారన్నారు. నిన్న కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తి గతంగా ఏపూజలు చేసుకున్నా అది వారి మతానికి సంబంధించిన వారి వ్యక్తిగత విషయమని దానిగురించి గొప్పగా చెప్పుకున్నా తక్కువగా చెప్పుకున్నా మేము పట్టించుకోమనీ కానీ ఆయన దానిద్వారా మరికొంతమందిని, కొన్ని సామాజికవర్గాలని దూషించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇది సిద్ధం కార్యక్రమానికి కొనసాగింపుగా తాము భావిస్తున్నామన్నారు. వాళ్ళు భీంలీ సభ, దెందులూరు సభ నిన్న రాప్తాడు సభలు నిర్వహించి ఆయన చాలా గొప్పలు చెపుతుంటే, నిన్న వారి సోషల్ మీడియా పోస్టులలో ఒక చిత్రమైన పదాలని వాడారనీ అదేమిటంటే భీంలీలో భయపెట్టాం, దెందులూరులో దడపుట్టించాం, అనంతపూర్లో అల్లాడిస్తాం అని, ఇది కాకినాడనుంచీ జనసైనికునిమీద వాళ్ళు పెట్టిన పోస్టర్ అని, దీనినిబట్టి ఈ వై.సి.పి వాళ్ళ దృష్టిలో సిద్ధం అంటే ప్రజలమీద దండయాత్రకి సిద్ధము అని అర్ధమవుతోందన్నారు. ప్రజల యొక్క మాన, ప్రాణ ఆస్థులని దౌర్జన్యంగా భంగపరుస్తాము దానికి మేము సిద్ధం అని చెపుతున్నారన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కాకినాడలో చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను ఎం.ఎల్.ఏ అయ్యాకా మొదటిసంవత్సరమే మహిళలముందు తన అహంకారాన్ని ఒక పబ్లిక్ మీటింగులో వ్యక్తిగత ధూషణకు తీసుకెళ్ళారనీ అది అలా కంటిన్యూ చేసుకుపోతున్నారనీ రాష్ట్రంలో అక్కడ కొడాలి నానీ, రోజా గారు ఎవరికివాళ్ళు వ్యక్తిగత ధూషణలని పరాకాష్టకి తీసుకెళ్ళిపోయారనీ కాకినాడలో కూడా వారుతీసుకెళ్ళుతున్న తీరుని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాజకీయాల్లో సైద్ధాంతిక విమర్శలు తప్ప వ్యక్తిగత ధూషణలు ఉండకూడదన్నారు. వారుచేసే తప్పులని ప్రతిపక్షంగా విమర్శిస్తామనీ అదిలేకుండా కాకినాడలో చేసారన్నారు. వై.సి.పి వాళ్ళు సిద్ధం అంటున్న దానికి ప్రతిస్పందనగా తాము గత 15 రోజులుగా మేము సిద్ధం అనే కార్యక్రమాన్ని చేస్తున్నామనీ అది అందరికీ తెలుసనీ పత్రికా విలేఖరుల సమక్షంలో మరియు ప్రజల మధ్యలో చెపుతున్నాము ప్రతిచోటా వై.సి.పి వాళ్ళ దౌర్జన్యాలని, వాళ్ళ అహంకార చర్యలని ప్రశ్నిస్తూ జనసైనికులు వాటిపై పోరాడుతామని చెపుతున్నామన్నారు. జనసేన పార్టీగా ఏవ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, మతాన్ని కానీ, సామాజిక వర్గాన్ని కానీ గౌరవించని వాళ్ళని మేము ఖండిస్తామనీ, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడుగారు ఒకటే చెపుతున్నారనీ బూతులు మాట్లాడుతున్న ప్రజాప్రతినిధుల సంగతి ప్రజలు బూత్ లలోకి వెళ్ళి చెప్పాలని అన్నారనీ, ఈమాటని కాకినాడ ప్రజలు అందరూ రానున్న రోజుల్లో బూతులకి ముగింపు పలుకుతారనీ మాన మర్యాదలని గౌరవించుకునే వారిని జనసేన పార్టీని గెలిపించుకుంటారన్నారు. మళ్ళీ మళ్ళీ చెపుతున్నాం ఈ అరవై రోజులలో మీరు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వండి తప్పులేదు, వ్యక్తిగత ధూషణలు ఆపండి ఎవరెవరు ఎంత తిన్నారో ప్రజలు అంతా చూస్తున్నారనీ సమకాలీన రాజకీయ నాయకుడిగా తాను హితవు పలుకుతున్నానన్నారు. ఈ సమావేశంలో జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, ఓలేటి రాము, సిటి కార్యదర్శి వాడ్రేవు లోవరాజు, సుమంత్, ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, కె. ఆదినారాయణ, దాసరి సత్తిరాజు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.