తెలుగుదేశం, జనసేనల కలయికతో వైసిపి నేతలు భయం పట్టుకుంది

  • ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జి పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ జనసేన, టిడిపి కలయిక తో భయపడి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి వైసిపి పూనుకుంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసైనికులు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వైసిపి కుట్రే.. పవన్ నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. వైసిపి నాయకులు దోపిడీని బయటపెట్టి వాళ్లు పారిపోవాలనుకున్నా అవకాశం ఇవ్వకుండా ప్రజలసమక్షంలో శిక్షిస్తామని పితాని పేర్కొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోదాశి పుండరీస్, పితాని రాజు, అరిగెల శ్రీను, విత్తనాల రవితేజ మొదలగువారు పాల్గొన్నారు.