వైసిపి, టిడిపి నేతలు జనసేనలో చేరిక..

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం ఆధ్వర్యంలో గ్రామంలో రాజకీయ మంచి నేపథ్యం ఉన్న వైసిపి, టిడిపికి చెందిన కీలక నేతలు వల్లభశెట్టి శేషు (టిడిపి పార్టీ వైస్ ప్రెసిడెంట్), కొత్తపిల్లి ఆదివిష్ణు (వైఎస్ఆర్సిపి పార్టీ), నంద్యాల రాజేష్ (వైసీపీ), దేవిరెడ్డి దేవరాజు (వైసీపీ), బద్దిరెడ్డి అన్నవరం (వైసీపీ), బద్దిరెడ్డి సత్యనారాయణ (టీడీపీ), బండారు చిన్నబ్బాయి (టీడీపీ), ఇతర నాయకులు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు.. బత్తుల బలరామకృష్ణ బలమైన నాయకత్వం నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.