బస్సు యాత్ర పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన వైసీపీ: గాదె

  • నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని సభల్లో మాట్లాడే ముఖ్యమంత్రి వారికి ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయకుండా బస్సు యాత్ర పేరుతో కొత్త నాటకానికి తెర తీశారు

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు లాడ్జి సెంటర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారక బస్సు యాత్ర అనే పేరులోనే తప్పు ఉందని, తెలుగు ప్రకారం వ్యాకరణంలో లోపం ఉందని పేరు కూడా సరిగ్గా పెట్టుకోవడం రాని ఈ ప్రభుత్వం వారికి ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. అలాగే ఈ యాత్ర కేవలం ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం మాత్రమే పెట్టిందని వైసిపి వాళ్ళు చెబుతున్నారని, కానీ ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్ని కులాల్ని అన్ని మతాలని ఒకే విధంగా చూడాలని ఇలా కులాల వారీగా రెచ్చగొట్టడం విడగ్గొట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అలాగే కొంతమంది మంత్రులు మా జగనన్న మాకు బస్సు ఎక్కే ఆకాశం ఇచ్చారని, అదేదో పెద్ద అవకాశం మాదిరిగా గతంలో రాజులను పొగిడితే ఏదో ఒక బహుమతి ఇచ్చేవారు అంతకన్నా దారుణంగా ఈ వైసిపి మంత్రులు తయారయ్యారని ఏద్దేవా చేశారు. ఈ బస్సు యాత్ర మూడు ప్రాంతాల్లో అనగా ఉత్తరాంధ్రలో ఇచ్చాపురంలో, దక్షిణాంధ్రలో సింగనమలలో, మధ్య ఆంధ్రలో తెనాలిలో పెట్టారని, ఇచ్చాపురంలో బీసీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతం అక్కడ ఉన్న బీసీ ఎమ్మెల్యే ని గృహనిర్బంధం చేసి మరి ఈ యాత్ర చేయడం వైసిపి వారి వికృత శాష్టలకు నిదర్శనమని, అలాగే సింగనమలలో ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కనీసం ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడడానికైనా అవకాశం ఉందో లేదో చెప్పాలని తెలియజేశారు. అలాగే మధ్య ఆంధ్ర ప్రాంతంలో తెనాలిలో పెట్టడం వెనుక అంతర్యం ఏంటని, ఎందుకంటే అది ఓసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని, వైసిపి వారికి దమ్ముంటే గుంటూరు తూర్పు నియోజకవర్గం లో పెట్టే వాళ్ళని, ఎందుకంటే అక్కడ ఎప్పటినుంచో మైనార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అక్కడ పెడితే మైనార్టీలు తిరగబడతారని, నువ్వు మైనార్టీలకు ఏం చేశామని చెప్పి అడుగుతారని భయపడే ముఖ్యమంత్రి గారికి నచ్చని సామాజికవర్గం అయినా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పెట్టడం హాస్యాస్పదమని తెలియజేశారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గాన్ని రెండు కార్పొరేషన్లుగా విడదీసి, వారికి ఏం ఒరగా పెట్టారని, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ, బిసి కార్పొరేషన్ ద్వారా కొన్ని నిధులు కేటాయించి, వారికి స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టేవారని ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతమందికి స్వయం ఉపాధి కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీల మీద విపరీతంగా దాడులు పెరిగాయని, ఉదాహరణకు కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిని చేసి చంపేసిన ఘనత, అలాగే వైసిపి ఎమ్మెల్సీ వారి యొక్క దళిత డ్రైవర్ ని చంపివేసి వారి ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంగతి రాష్ట్రమంతా తెలుసు. ఇదొక్కటే కాక ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎస్సీల మీద ఈ ప్రభుత్వంలో విపరీతంగా దాడులు పెరిగాయని తెలియజేశారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎన్ని రోడ్లు వేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో నివసించే అటవీకులకు కనీస సదుపాయాలు కూడా లేవని, వారు గర్భవతులైతే కాన్పుల కోసం రావడానికి రోడ్లు కూడా లేవని తెలియజేశారు. అలాగే బీసీ తరఫునుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ జగనన్న మమ్మల్ని బస్సు ఎక్కడానికి అనుమతి ఇచ్చాడు అని చెప్పుకోవడం వారి దిగజారుడుతనానికి మరియు దీనస్థితికి నిదర్శనమని, అలాగే ఎస్సీ సామాజిక వర్కర్ ని చెందిన నారాయణస్వామి గొప్ప ముఖ్యమంత్రి ఇచ్చామని గొప్పలు చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా అందరి ముందు అతనిని నిలబెట్టే అవమానించాడో ప్రజలందరికీ తెలుసు అని,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులకు ఏమాత్రం చెత్తా శుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రత్యేకంగా ఏం చేశారో తెలియజేయాలని అన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలు ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని ఇప్పుడు అక్కడికి వెళ్లి ఉండే పరిస్థితి ఎవరికీ లేదు అని తెలియజేశారు. అలాగే మైనార్టీల విషయానికొస్తే గత ప్రభుత్వంలో ఉన్న షాదీ తోఫా లాంటి అన్ని పథకాలను రద్దు చేయడమే కాకుండా, అబ్దుల్ కలాం గారి పేరుతో ఉన్న విద్యా విధానానికి నా పేరు తీసివేసి వారి తండ్రిగారి పేరు పెట్టడం అనేది వైసిపి వారికి మైనార్టీల పట్ల ఉన్న చులకన భావం అర్థమవుతుంది. అసలు ఈ ప్రభుత్వం ఈ యాత్ర చేయడానికి అర్హత లేదని, ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఆలోచించి జనసేన టిడిపి పార్టీ కూటమికి ఓట్లు వేసి అధికారంలోకి తేవాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమాల్, జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖ బాలు మరియు తదితరులు పాల్గొన్నారు.