జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు

పాడేరు నియోజకవర్గం: అయినా కొయ్యురు మండలము, గధబపాలెం, కొత్తూరు గ్రామ వైసీపీ కార్యకర్తలు ఉల్లి దశరద్, ప్రసాద్, మహేంద్ర గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆధివాసీలకు వైసీపీ ప్రభుత్వం తీరని మోసం చేసిందని యువతకు ఉపాధిలేదు, గ్రామసీమల అభివృద్ధి నిధులు దారి మళ్లించి పంచాయితీల అభివృద్ధి నిర్వీర్యం చేసిందని అందుకే మేము మిమ్మల్ని కలవడానికి వచ్చామని జనసేన పార్టీతో నడవాలని అనుకుంటున్నామని అన్నారు. వారి నుద్దేశించి ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ.. తప్పకుండా జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని స్వాగతిస్తున్నామని త్వరలోనే మా ఇన్చార్జ్ డా. గంగులయ్యగారి సమక్షంలో మీ చేరికలు జరిగేలా చూస్తామని ముందుగా ఈ రోజు మా తరుపున పార్టీలో చేర్చుకుంటున్నామని రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపనకు మనమంతా కలిసి పని చేద్దామని చెప్తూ వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.