నీవే నా బలం.. సంతోషం: సుమ

మాటల పుట్ట, యాంకర్ సుమ తన భర్త, సినీనటుడు రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. రాజీవ్‌పై తనకున్న ప్రేమాభిమానాలను ఆమె ఇందులో స్పష్టంగా వెల్లడించింది. ‘నా ప్రియమైన రాజా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవే నా బలం.. సంతోషం. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు దేవుడిచ్చాడు. నీతో కలిసి జీవించే ప్రతిరోజు ఓ కొత్త రోజులా ఉండాలని నేను భావిస్తున్నాను. లవ్ యూ. నువ్వు, నేను ఒక్కటే నా ప్రియమైన రాజీవ్ కనకాల’ అని సుమ పేర్కొంటూ.. తన భర్తతో కలిసి గతంలో తీసుకున్న ఫొటోను ఆమె ఈ సందర్భంగా సుమ పోస్ట్ చేసింది.