ముద్రగడ హత్యకు వైసిపి కుట్ర

  • కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు వబ్బిన సన్యాసి నాయుడు లేఖ

ఎస్ కోట: 2024 ఎన్నికలలో వైసీపీ గెలుపుకు, మాజీ మంత్రి ముద్రగడపద్మనాభంను హత్య చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నెపం మోపడానికి వైసీపీ కుట్ర పన్నడం పట్ల కాపు బలిజ ఉద్యమ నేత, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లోనూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డినీ వైసీపీ నాయకులు హత్య చేసి, చంద్రబాబు నాయుడు పైన నెపం మోపారు అని సన్యాసి నాయుడు గుర్తు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సీఎం పదవి కోసం హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన కారణంగా 400 వందల మంది హత్యకు గురైన విషయం వాస్తవమేనని, అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ప్రకటించారు అని సన్యాసి నాయుడు పేర్కొన్నారు. సానుభూతి కోసం ముద్రగడను హత్య చేసి, హత్యను జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన నెపం మోపే ప్రమాదం ఉన్నందున, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెంటనే ముద్రగడ పద్మనాభంకు కేంద్ర బలగాలుతో రక్షణ కల్పించాలని సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధినేత జగన్, 50 సంత్సరకాలంగా నేర చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చారని, వైసీపీకి హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అమిత్ షాకు రాసిన లేఖలో వబ్బిన సన్యాసి నాయుడు విజ్ఞప్తి చేశారు. ముద్రగడ పద్మనాభం ప్రాణాలకు ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత సీఎం జగన్ దే ననీ సన్యాసి నాయుడు స్పష్టం చేశారు.