శ్రీకృష్ణదేవరాయలను అవమానిస్తున్న వైసీపీ నేతలు

  • శ్రీవారికి ప్రథమ భక్తుడు రాజాధిరాజైన శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు పట్టించుకోరా!
  • అన్ని చరిత్రలు తెలుసు అని చెప్పుకునే వారికి రాయలవారి చరిత్ర తెలియదా లేక పట్టదా!
  • రాయల్ వారి విగ్రహ అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలి..
  • జనసేన పార్టీ డిమాండ్..

తిరుపతి: శ్రీనివాస సేతు నిర్మాణంలో భాగంగా లీలా మహల్ కూడలిలోని శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహాన్ని సమీపంలోని మున్సిపల్ పార్కు కు తరలించి పట్టించుకోకపోవడం బాధాకరమని, కనీసం రాయలవారి విగ్రహం శుభ్రతకు కూడా నోచు కోకపోవడం చూపరుల మనసును బాధ కలిగిస్తున్నదని జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, హేమ కుమార్, బాబ్జి, సుమన్ బాబు, మునస్వామి, రాజమోహన్, సాయి దేవ్ యాదవ్, కర్ణం లక్ష్మి, దుర్గ, మనోజ్, హేమంత్, సుదీర్, ఆది కేశవులు, హిమవంత్, బలరాం, రమేష్, సుజిత్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.. మంగళవారం తిరుమల బైపాస్ రోడ్డులోని మున్సిపల్ పార్కు నందు విజయనగర సామ్రాజ్యం అధినేత శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని జనసేన నాయకులు శుభ్రపరచి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలక పార్టీ వైసిపి లోని బలిజలు వెంటనే స్పందించి రాయల్ వారి విగ్రహాన్ని ఇకనైనా పట్టించు కోవాలని, రాయల్ వారు అన్ని కులాల వారికి రాజు అని గుర్తు చేశారు. తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.