రోడ్లు లేని గ్రామాల్లో అభివృద్ధి చేశామని చెప్తున్న వైసిపి పాలకులు

ఆలూరు, రోడ్లు లేని గ్రామాల అభివృద్ధి చేశామని చెప్పడం ఏమిటో విడ్డూరంగా ఉందని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. మూడుసంవత్సరాలు కాలంగడిచిపోయినా ఇప్పటికీ ఆలూరు నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలలో రహదారులు డ్రైనేజీలు తాగునీటి సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నాయకులు మాత్రం అభివృద్ధి చేశామని ఎలా చెబుతున్నారని జనసేన వీర మహిళ ఎరుకుల పార్వతి ప్రశ్నించారు. వైసిపి పాలకులు నాయకులు రోడ్లు లేని గ్రామాలపై దృష్టి పెట్టండి పవన్ కళ్యాణ్ పైన కాదని పవన్ కళ్యాణ్ ని విమర్శించింతమాత్రాన ప్రజలు పట్టం కడతారని పగటి కలలు కంటున్నారని జనసేన వీర మహిళ ఎరుకుల పార్వతి అన్నారు. పదవులు శాశ్వతం కాదని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి విమర్శలతో వైసిపి పాలకులు నాయకులును హెచ్చరించారు రోడ్లు లేని గ్రామాలపై దృష్టి పెట్టండి ఆ గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.