వైఎస్సార్ జలకళ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పధకం ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల విషయంలో మడం తిప్పక.. మరిన్ని వినూత్న పథకాలతో ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం. తాజాగా రైతుల కోసం మరో సంతోషకరమైన హామీని నెరవేర్చింది. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్‌వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ‘వైఎస్సాఆర్‌ జలకళ’ పథకానికి నేడు శ్రీకారంచుడుతుంది. ఇవాళ ఈ కొత్త పథకాన్ని అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక, పథకాన్ని ఉపయోగించుకోవాలనుకున్న రైతన్నలు తమ పరిధిలోని వాలంటీర్ల ద్వారా.. పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ అప్లై చేసుకునే వీలు ఉంది.

బోరు డ్రిల్లింగ్‌ వేసేముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. అయితే, ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. దీనికి సంబంధించిన సమాచారం అప్టేడ్స్ సదరు రైతుకు ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు.