వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక బంద్‌

కేంద్రప్రభుత్వంతోపాటు, రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ కర్ణాటకలో బంద్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బంద్‌కు మద్దతుగా రాష్ట్రంలోని వ్యవసాయ సంబంధ దుకాణాదారులు స్వచ్చంగా తమ షాపులను మూసివేశారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు కర్ణాటక ప్రభుత్వం మరో రెండు చట్టాలకు సవరణలు చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ భూములను సులభంగా కొనుగోలు చేసే రెండు చ్చట్టాలకు బీఎస్ యెడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలు చేశాయని ఆరోపించింది.