యువశక్తి పోస్టర్ విడుదల చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, యువశక్తి మన యువత – మన భవిత భారీ బహిరంగ సభ యువత సమస్యలపై గళమెత్తనున్న జనసేనాని పోస్టర్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ విడుదల చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 12 తారీఖున జరగబోవు యువశక్తి భారీ బహిరంగ సభకు పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాల నుంచి భారీగా యువత బయలుదేరుతుందని దానికి తగిన ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు డాక్టర్ శ్రీధర్ అన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి యువత అంతా భారీగా తరలి రావాలని పిఠాపురం నియోజవర్గ యువతకు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునివ్వడం జరిగింది.