జనంకోసం జనసేన మహాపాదయాత్ర 11వ రోజు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, చిన్నకొండేపూడి గ్రామంలో జనసేన నాయకులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ… జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను వివరిస్తూ… ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి, ఆశీర్వదించాలని, ఈ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ విధివిధానాలతో కూడిన కరపత్రం ప్రతి ఒక్కరికి పంచుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, మట్ట సుబ్రహ్మణ్యం, కోనే శ్రీను, ప్రశాంత్ చౌదరి, మాధవరపు వీరభద్రరావు, ముత్యాల హరీష్, సందీప్, శ్రీహరి, మూర్తి, మోహన్ పిఎస్పీకే, మాధవరపు నాని, ఉమ్మడిశెట్టి సురేష్, పసుపులేటి ఏసు, సుందరపల్లి చైతన్య, అప్పుల శ్రీను, చిక్కం నాగేంద్ర, వివేక్ పిండి, ఆకుల సుబ్బు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.