భారతీయ సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు హాజరయి ఫూలే చిత్రపటానికి పూలమాల అలంకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈదేశంలో మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్యం విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారబోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ ఎప్పుడూ కూడా మహానాయకుల స్ఫూర్తితో, ఆదర్శాలతోనే ముందుకు వెళుతుందని చెప్పారు. అలాగే వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత గిరిజన బహుజన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పూలే 150 ఏళ్ళ క్రితమే కార్యచరణ చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, రాడ్లు శ్రీనివాసరావు, బత్తుల వీరాంజనేయులు, సోమిశెట్టి సుబ్రమణ్యం, ఐలం ఆదినారాయణ, తిరుమలశెట్టి సాంబ, శులం రాజ్యలక్ష్మి, నల్లపునేని రమేష్, గ్రంధి సదాశివరావు, అంచుల అనీష్, కేదార్ రమేష్, తిరుమలశెట్టి గోపి, పోగుల రాము, బొంబోతుల సుధాకర్, పసుపులేటి సాంబశివరావు, సూరంశెట్టి సతీష్, రుద్రజడ శివయ్య, చిట్టి బాబు, రాము సైదులు, తుమ్మల సురేష్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.