ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 22వ రోజు

  • ఏలూరు నియోజవర్గంలో స్థానిక న్యూ ఫిష్ మార్కెట్లో పాదయాత్ర

ఏలూరు, వ్యాపారస్తులు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారని ఇక్కడున్నా వ్యాపారస్తులు వ్యాపారం చాలా దీనస్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదు అని స్థానిక వ్యాపారస్తులు జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఫిష్ మార్కెట్లో నిర్మాణం చేసిన దుకాణాల్లో మధ్యలో సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే వ్యాపారస్తులు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాన్ని సజావుగా సాగనీయకుండా చేస్తున్నారని చాలా ఇబ్బందులకి గురవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. వ్యాపారస్తుల కష్టాలు తీర్చట్లేదు గానీ ఆశీల రూపంలో వాళ్ళు జేబులు గుల్ల చేస్తున్నారని చెప్పి అప్పలనాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. సరైన మౌళిక సదుపాయాలు కల్పించకుండా ప్రతిరోజు ఆశీల రూపంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు వేల వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని అప్పలనాయుడు తెలియజేశారు. ఇకనైనా ఏలూరు నగర మున్సిపాలిటీ మేయర్ మరియు ఆళ్ల నాని ఈ సమస్యలపై స్పందించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని హెచ్చరించారు. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సుమారు 30 మంది ఇతర పార్టీల నుండి కార్యకర్తలు రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, బొత్స మధు, నాయకులు బుధ్ధా నాగేశ్వరరావు, పసుపులేటి దినేష్, అల్లు సాయి చరణ్, నిమ్మల శ్రీనివాసు, బొద్దాపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు, వీర మహిళలు కావూరి వాణి, సరళ, ఉమా దుర్గా, సుజాత తదితరులు పాల్గొన్నారు.