పెడనలో జనసేన ఆధ్వర్యంలో వెయ్యి మందికి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ 2వ రోజు

  • యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

పెడన నియోజకవర్గం, పెడన పట్టణంలో శ్రీ డొక్క సీతమ్మ మజ్జిగ పంపిణీ 2వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలోని స్ధానిక గూడూరు వెళ్ళే రోడ్డు, బంటుమిల్లి రోడ్డు సెంటర్, తోటమూల సెంటర్ నందు ఎండలో ఇబ్బందులు పడుతున్న వారికి దాహార్తిని తీర్చేందుకు వెయ్యి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, పోలగాని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందరరాజు, కోట నాగరాజు, గుడిసేవ శ్రీనివాసరావు, బుద్దన బాబీ, గడ్డిగోపుల నాగాంజనేయులు, అంజిబాబు, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.