పెడనలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం 3వ రోజు

పెడన నియోజకవర్గం, పెడన పట్టణంలో గురువారం శ్రీ డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ 3వ రోజు కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని స్ధానిక గూడూరు రోడ్డు, రైల్వే గేటు వద్ద ఎండలో ఇబ్బందులు పడుతున్న వారికి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, పత్తిపాటి జయకృష్ణ, వరుదు, నందం శివ స్వామి, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.