ఆజాద్ నగర్ లో మహిళలతో మాటామంతి 43వ రోజు

  • జగన్ నేడు రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఆస్తులు సైతం అమ్ముకుంటాడు
  • రాజదాని నిర్మాణం వైపు ఎటువంటి అడుగులు వేయకుండా సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటు
  • 43వ రోజు 40వ డివిజన్ ఆజాద్ నగర్ లో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 43వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 40వ డివిజన్ ఆజాద్ నగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై డివిజన్ పరిధిలో సమస్యలను తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి నిస్సిగ్గుగా రాష్ట్ర సచివాలయాన్ని హెచ్ డీఎఫ్ సి బ్యాంకుకు 370కోట్లకు తాకట్టు పెట్టడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రతిష్టకు ఈ చర్య భంగం కలిగించే విధంగా ఉందని జగన్ రెడ్డి నిర్మాణ దశలో ఉన్న అమరావతిని పక్కకుపెట్టి మూడు రాజదానుల జపం చేసి ఎక్కడా రాష్టానికి రాజదాని లేకుండా చేసి తీరా ఉన్న సచివాలయాన్నే బ్యాంకులకు తాకట్టు పెట్టడాని ఇంతకంటే దుర్మార్గపు చర్య మరొక్కటి ఉంటుందా కాబట్టి ప్రజలంతా గమనించాలి నేడు సచివాలయాన్ని తాకట్టు పెట్టినోడు మళ్ళీ అధికారంలోకి వాస్తే మన ఆస్తులుసైతం లాక్కొని అమ్ముకునే పరిస్థితులు దాపరిస్తాయని కనుక మనమందరం మేల్కొని జనసేన టీడీపీలకు ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు బాధ్యత పవన్ కళ్యాణ్ నారా చంద్ర బాబు నాయుడు చూసుకుంటారని అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో మురుగుకాలువలలో చెత్త తీసి నెలరోజులైన రోడ్ల మీదనే అలాగే ఉంచుతున్నారని మున్సిపల్ అధికారులు ఈ పద్ధతులు మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.