జనం కోసం జనసేన 555వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 555వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం, సుబ్బయ్యమ్మపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 250 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 91710 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 556వ రోజు కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జగ్గంపేట మండలం, కృష్ణాపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్, సుబ్బయ్యమ్మపేట నుండి గ్రామ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీను, బుసాల గణేష్, ఉగ్గిన చిన్న, యర్ర అనిల్, మోటూరి చరణ్, నామన సూర్యప్రకాష్, గొల్లవిల్లి రామ దుర్గాప్రసాద్, ఉప్పలపాడు నుండి అంకం ఓమ్ కృష్ణ, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని, శ్రీదేవి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం కొనసాగిస్తారని తెలియజేసారు.