జనసేన భీమ్ యాత్ర 8వ రోజు

కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో 39వ డివిజన్ చీడీలపోర ప్రాంతంలో జనసేన భీమ్ యాత్ర 8వ రోజు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకిరామారావు మాట్లాడుతూ గత 8 రోజులగా భీం యాత్రని కాకినాడ సిటిలో జరుపుతున్నామనీ, అమాయకులైన దళితులకి తమపట్ల ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని, దురాగతాలని తెలియచేస్తూ చైతన్యపరుస్తున్నామన్నారు. దళితుల పేర్లపై కాంట్రాక్టులు, అనుమతులు తీసుకుంటూ వారికికూడా తెలియకుండా వారి పేరుమీద వ్యాపారాలు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తునారనీ, ఏదైనా అల్లరి జరిగితే దళితుల మీద తోసేసి జారుకుంటున్నారన్నారు. నోరుతెరిచి ప్రశ్నిన్స్తే కౄరంగా హింసించి అణిచేస్తున్నరు ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో నిర్మూలించే రోజు తొందరలోనే ఉందని హెచ్చరించారు. భీమ్ యాత్రలో భాగంగా ముంబై ప్రయాణానికి టికెట్లను తీసుకుంటూ టౌన్ రైల్వే స్టేషనుకు వెళ్ళి అక్కడ కూడా ప్రజలని చైతన్యపరచడం జరిగిందన్నారు. తదుపరి చీడీలపోరలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వీరమహిళలు బండి సుజాత, భవాని, సోని ఫ్లోరెన్స్, బోడపాటి మరియా, బట్టు లీల, దీప్తి, జనసేన నాయకులు ఆకుల శ్రీను, వలి భాష, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.