వారాహి యాత్ర విజయవంతం కావాలని తుని జనసైనికుల పాదయాత్ర

తుని నియోజకవర్గం: జూన్ 14వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈ యాత్ర విజయవంతం కావాలని తుని నియోజకవర్గ జనసైనికులు శుక్రవారం తుని నుండి అన్నవరం పాదయాత్ర చేస్తూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి పలివెల లోవరాజు, తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు, తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, జనసేన నాయకులు తేనే నాగశేషు, సీతారామరాజు, బాలాజీ, నాగబాబు, జనసేన శివ, భాస్కర్, వంశీ, రాంబాబు, వీరబాబు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.