టిడ్కో ఇళ్ళను పరిశీలించిన అళహరి సుధాకర్

కావలి మద్దూరు పాడులోని టిడ్కో ఇళ్ళను జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన కావలి, మద్దురుపడులో టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకొని కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 4 ఏళ్ల పైబడి ఇళ్ళను పాడుబెట్టినందు వలన చాలా ఇళ్ళలో ద్వారబంధాలు చెదలు పట్టి ఉండటం, కనీస నీళ్ళ వసతి లేకపోవడం, కరెంట్ మీటర్లు పెట్టేదగ్గర కరెంట్ వైరులు దొంగతనము జరిగి ఉండటం, వీది దీపాలు లేక పాముల బెడతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇళ్ళు ఇచ్చేముందు అన్నీ ఇస్తామని చెప్పి కనీస నీటి, కరెంటు సదుపాయము కల్పించకుండా, ఇంటి యజమానులు ఎలా ఉంటారు. ఉన్న అద్దె ఇళ్ళలో గత నాలుగు ఏళ్లుగా అద్దె ఇంటి బాడుగలు కట్టుకుంటూ, ఇప్పుడు వచ్చిన సొంత ఇంటిలో ఉండలేక ఇంకా ఇళ్ళ అద్దెలు కట్టుకో వలసి వస్తుందని లబ్ధిదారులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్లతో సంప్రదించి వెంటనే కావలి మున్సిపల్ కమిషనర్ వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని అళహరి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో బెల్మంకొండ వెంకటేశ్వరులు, పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, ఆలా శ్రీనాథ్, మస్తాన్, మణికంఠ, సుధీర్, వెంకయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.