వారాహి యాత్ర విజయవంతం కావాలని విశాఖ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14న తలపెట్టిన “జనంలోకి జనసేనాని”, “వారాహి యాత్ర” విజయవంతం కావాలని, యాత్రకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా దిగ్విజయంగా సాగాలని విశాఖ వెస్ట్, గాజువాక డిపో, అభయ ఆంజనేయ స్వామి వారి గుడిలో విశాఖ వెస్ట్ జనసేన సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి 201 కొబ్బరికాయలు కొట్టటం జరిగింది.