సర్వేపల్లిలో జనం కోసం జనసేన 23వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం, తిరుమలమ్మ పాలెం పంచాయతీ నందు జనం కోసం జనసేన 23వ రోజు కార్యక్రమాన్ని గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలమ్మ పాలెం ఉప్పుకాలపై హై లెవెల్ వంతెనకి మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు, పోతున్నారు. వరదలు వస్తున్నాయి రాకపోకలు ఆగిపోతున్నాయి. కానీ వరదలు సమయాలలో తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలు పడే అవస్థలు పడే ఇబ్బందులు వారి కష్టాలు ఈ నాయకులకు పట్టవు. ఎనిమిది నెలలు అయింది ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 12 కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తా అని చెప్పి. ఇప్పటివరకూ కనీసం శిలాఫలకం వేసిన పరిస్థితి కూడా లేదు. గత ప్రభుత్వంలో శిలాఫలకం వేశారు. తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పారు. మరి ఆ తొమ్మిది కోట్ల ఎటు పోయినాయి. ఆ శిలాఫలకం ఎటు పోయిందో తెలీదు. మళ్ళీ ఈయన 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పాడు. కనీసం శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవు. వీళ్ళ వాగ్దానాలు వీళ్ళ మాటల గారడి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళ వాగ్దానాలు మాటలకి తప్ప చేతల్లో చేసే పరిస్థితి లేదు. ఈ తిరుమలమ్మపాలెం గ్రామానికి కలగా ఉన్న హై లెవెల్ వంతెన నిర్మాణం ఒక జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరుగుతుంది. వీళ్ళు ఎవరు కూడా చేయరు. తిరుమలమ్మపాలెం గ్రామ ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి అని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సందూరి శ్రీహరి, ఖాజా, సందీప్, బోయిన వెంకటేశ్వర్లు, విజయ్, పోలిచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.