వైయస్సార్సీపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి

  • రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి

అనంతపురం: పవన్ కళ్యాణ్ గారిపై పని కట్టుకొని విమర్శించే వైయస్సార్సీపి నాయకులకు నేనొక్కటే చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకోవాలని రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ కుప్పాల జ్యోతి పేర్కొన్నారు. సోమవారం కుప్పాల జ్యోతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో వాలంటరీ వ్యవస్థను తప్పుగా అనలేదు. వాలంటరీ వ్యవస్థ అనేది మీరు నియమించుకునటువంటి వ్యవస్థ కదా ఈరోజు రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఓ కుటుంబంలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు. ఎంతమంది మహిళలు ఉన్నారు. ఎంతమంది పెళ్లి కానీ ఆడవాళ్లు ఉన్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరు ఏ పార్టీ కి చెందినవారు అన్న సమాచారం కోసం మీరు పనికొట్టుకొని మరి వాలంటరీ వ్యవస్థను నియమించి ఉన్నారని ఆమె తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో ఇన్ని తెలిసిన మీ వాలంటరీ వ్యవస్థకి ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైనటువంటి బాలికల లిస్టు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. అది విని ఇంకిత జ్ఞానం లేని కొంతమంది ఏ వైసీపీ నేతలు పనిగట్టుకుని మరి పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థలను ఎత్తి చూపారు వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇకపోతే పని కట్టుకొని మరి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి భార్యనీ, అమ్మనీ పనిగట్టుకుని సోషల్ మీడియాని అడ్డుగా తీసుకొని కొంతమంది తప్పుడు పదజాలంతో దుషిస్తుంటే అన్నయ్యనీ విమర్శించే వెధవలకి నేను ఒకటే చెబుతున్నా.. మీకు మనస్సాక్షి ఉంటే మీ నాయకుడు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి చేశాడో ఒకసారి ప్రశ్నించి చూడండి. అంతేగాని తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసును విమర్సించే అధికారం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి లేదని మీరు తెలుసుకోవాలని ఆమె తెలియజేశారు. ప్రజల్లో జనసేన పార్టీకి నమ్మకం వచ్చింది. 2024లో ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన కడప జిల్లా నుండి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడతారని ఆమె తెలియజేశారు. ఇకపోతే వారాహి యాత్ర మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో దశ జరుగుతుండగా ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక నీచపు వ్యాఖ్యలకు దిగజారుతున్నారని ప్రశ్నించారు. మీరు ఏదైనా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి లా దీటుగా నీతి నిబద్ధతతో రాజకీయం చేయాలి గాని మా నాయకుడు యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ ఏదో విధంగా ప్రజల్లో ఆయనను కించపరచాలని మీ ప్రయత్నం ఎప్పటికీ సరి కాదని అన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ పాలనలో విసుగెత్తి పదేళ్లు వెనక్కి పోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఉందని, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే కచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కొరుకుంటున్నారని ఆమె తెలియజేశారు.