వైసీపీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పాలకొండ జనసేన నిరసన

పాలకొండ నియోజకవర్గం: వైసీపీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పాలకొండ జనసేన ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. అనంతరం చెక్ పోస్ట్ కూడలి నుండి ర్యాలీ చేస్తూ.. మహాత్మా గాందిజీ గారికి పోలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అతి పెద్ద మానవహారం నిర్వహించి, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తున్నారని, వైసీపీ పాలనకు జనసేనతో ముగింపు పలుకుతామని జనసేన నేతలు అన్నారు. జనసేన అధినేత మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన వాస్తవాలు మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత బయోడేటాని వాలంటీర్లు సేకరిస్తున్నారన్న విషయాన్ని బట్టబయలు చేశారని, ఆ కక్షతోనే వై సీపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారు. అలానే వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందని, ఈ ప్రభుత్వ అంత ముగించే దిశగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగులు ఉంటాయని కచ్చితంగా 2024లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, ప్రజలకు మంచి చేసే దిశగా జనసేన అడుగులు వెస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని పాలకొండ నియోజకవర్గం ప్రజలు అభిప్రాయం అని నియోజకవర్గం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాలుగు మండల నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.