ఒక అంగన్వాడీ టీచర్ పైనా మీ కక్ష సాధింపు చర్యలు..? మహంతి ధనుంజయ

బొబ్బిలి నియోజకవర్గం: ఒక అంగన్వాడీ టీచర్ పైనా మీ కక్ష సాధింపు చర్యలు అని జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల కార్యదర్శి మహంతి ధనుంజయ మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆవిడ అంగన్వాడీ టీచరా లేదా రాజకీయనాయకురాలా అన్న విషయం మీద అవగాహనకు వస్తే ఒకటి ఆవిడ అంగన్వాడీ సెంటర్ లో కూర్చుని మాట్లాడలేదు, విధుల నిర్వహణ అనంతరం ఇంటినుండి ఆమె మాట్లాడింది. రామభద్రపురంలో నివసిస్తున్న సామాన్య పౌరురాలిగా గ్రామంలో ఉన్న సమస్యలు మీద మాట్లాడే హక్కు ఆవిడకు లేదని రాజ్యాంగంలో ఉందా? వీడియోలో ఆవిడ మాట్లాడిన మాటలు పచ్చి సత్యాలని గ్రామం మొత్తం తెలుసు. వైద్యం కోసం బాడంగి ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది రామభద్రపురం ఉంచుకుని. ఇల్లులు ఉన్నవాళ్ళకే ఇళ్లపట్టాలు వచ్చాయి పేదవాళ్లకు రాలేదన్నది నిజం కాదా? మొన్న గడప గడపకు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎంత మంది మాకు ఇల్లులు రాలేదని చెప్పలేదు. రామభద్రపురం గ్రామాన్ని నిజంగా మీరు అభివృద్ధి చేసుంటే జనసేన పార్టీతో సోషల్ ఆడిట్ కు రండి ఇంటి ఇంటికి తిరుగుదాం. ఏ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. మీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ ఎందుకు కబ్జాకు గురి అవుతున్నాయి. ఆక్రమణలు ఎందుకు పెరిగిపోయాయి వీటికి మీరు సమాధానం చెప్పాలి. అఫీషియల్ గా ఎలా దోచుకుంటున్నారో గ్రామం మొత్తం తెలుసు. ఒక్క రోజైనా రామభద్రపురం అభివృద్ధి గురించి కానీ రామభద్రపురంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు గురించి కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారా? ఊరి సమస్యలు పరిష్కరించకుండా ఆవిడ ఉద్యోగం తీసెయ్యాలని, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఓ మహిళ మీద ఎందుకు మీ కక్ష సాధింపు చర్యలు, మహిళల మీద ఎందుకు మీ విన్యాసాలు ముందు ఊరి సమస్యలు పరిష్కరించండి. ఇకనైనా మహిళలు మీద మీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి లేదంటే కలెక్టర్ ఆఫీస్ కు కాదు సుప్రీం కోర్టుకైనా వెళ్లి మీ అక్రమణల మీద మీ కబ్జాల మీద న్యాయ పోరాటం చేయవలసి వస్తుందని జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల కార్యదర్శి మహంతి ధనుంజయ తెలిపారు.