రోడ్లు మరమ్మత్తులు చేయాలని జోరు వర్షంలో మోకాళ్ళపై జనసైనికుల నిరసన

గుడివాడ నియోజకవర్గం: గుడివాడ పట్టణ స్థానిక గుడివాడ కంకిపాడు రోడ్ నందు కల్వర్టు స్లాబ్ కి పెద్ద గుంట పడటంతో అటుగా వెళ్తున్న వాహనాలు ఆ గుంటలో పడి అదుపుతప్పి పడిపోవడంతో ఆ గుంత దగ్గర డేంజర్ బోర్డు పెట్టి వాహనదారులను దారి మళ్లించడంతో అక్కడ ఉన్న ప్రజలు జనసైనికులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(ఆర్.కె) మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి గుడివాడ కంకిపాడు రోడ్డు మార్గాన కల్వర్టు పైపు పగిలిపోవడంతో వెళ్తున్న వాహనదారులు ప్రమాద బారిన పడుతున్నారని ప్రభుత్వ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు గాని కనీస బాధ్యతగా మరమ్మతులు చేయకపోవడం చాలా దౌర్భాగ్యమని ఒక వాహనదారుడు ఆ గుంటలో పడి ఏదైనా జరిగితే ఆ కుటుంబ సభ్యులంతా వీధిన పడతారని ప్రజలు ప్రాణాలతో ఆడుకోవద్దని మేము కట్టే ప్రతి పైసా పన్నుల ద్వారా మీకు జీతాలు ఇస్తుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎవరో రావాలి ఏదో చేయాలని కాకుండా సమాజానికి మా వంతు సహాయంగా కృషి చేయాలని ఆలోచనతో వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రమాద సూచిక ఏర్పాటు చేయడం జరిగిందని గుడివాడ కంకిపాడు రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేసి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంట అంజి, పందేళ్ళ శీను, చరణ్ తేజ్, జనసైనికులు పాల్గొన్నారు.