కంచికచర్ల లో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

కంచికచర్ల: జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని మరోసారి సోషల్ మీడియా క్యాంపెయిన్ రూపంలో జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు కంచికచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ తెలిపారు. ఆ పార్టీ పిలుపులో భాగంగా శుక్రవారం మండలంలోని బత్తినపాడు, పరిటాల గ్రామాలలో జగనన్న కాలనీలు పరిశీలించి స్థితిగతులపై వీడియోలో ఫోటోలు రూపంలో డిజిటల్ క్యాంపెనింగ్ నిర్వహించారు. బత్తెనపాడు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన లేక ఎల్లనిర్మానాలు నిలిచిపోయాయని ఆయన అన్నారు. ఒకే ఒక్క ఇంటి నిర్మాణం అసంపూర్తిగా జరిగిందని మిగిలిన ఇళ్ళ నిర్మాణాలు కనీసం బేస్మెంట్ స్థాయిలో కూడా లేవని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తామని మాట మార్చిన జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. పరిటాల గ్రామంలో జగనన్న కాలనీ కేటాయించిన స్థలంలో ఒక వాగు ద్వారా నీరు ప్రవేశించి చెరువును తలపిస్తుందని తెలిపారు. ఏమాత్రం నివాసయోగ్యం కానీ ఇళ్ల స్థలాలను కేటాయించి లబ్ధిదారులను నీట ముంచుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. సమీపంలోనే రాళ్ల క్వారీలు ఉన్నప్పటికీ కాసుల కోసం కక్కుర్తి పడి వైసిపి నేతలు ఈ స్థలాన్ని అధికారుల ద్వారా కొనుగోలు చేయించారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికే పరిటాల గ్రామంలో రాళ్ల క్వారీ నుండి వస్తున్న కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూస్తూ అవే క్వారీలకు అత్యంత సమీపంలో స్థలాన్ని జగనన్న కాలనీకు కేటాయించడం చాలా దారుణమైన విషయమని జనం ఏమైతే మనకేంటి జేబులు నిండుతున్నాయి కదా అన్నట్లు ఈ ప్రభుత్వం తీరు కనిపిస్తుందని ఆయన అన్నారు. చాలాచోట్ల నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి వైసీపీ నాయకులు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారని ఆయన అన్నారు. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉందన్నారు. మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ తోట ఓంకార్ మండల ఉపాధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి పురమా ప్రసాద్, గోరుముచ్చు రాజు, సాయి హేమంత్ మాణిక్యాల బ్రహ్మం పురమకాళేశ్వరరావు పురమా శివయ్య, నర్రా కోటేశ్వరరావు పుప్పాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.